Monday, February 2, 2015

ఆ సంతోషమే వేరు...

మరిచిపోలేను...

ఎక్కడ పెట్టానో తెలియడం లేదు. ఎంతకీ దొరకడం లేదు. పుస్
తకాలన్నీ వెతికా. బ్యాగంతా జల్లెడ పట్టా. అయినా దొరకడం లేదు.  అమ్మకు చెబితే తిడుతుంది. తెలియకుండానే కంగారు.  ఏం చేయాలో తోచడం లేదు. ఇంతకీ ఏం వెతుకుతున్నానో చెప్పలేదు కదూ. మా  మా సార్ ఊరెళుతూ  ఇచ్చిన వెయ్యి రూపాయల కోసం.  మా ఇంటి పక్కనే అద్దెకు ఉంటారాయన.  ఈ నెల అద్దె ఇవ్వమని ఆ డబ్బులు ఇచ్చారు.  వెయ్యికే అంత కంగారా? అంటే అప్పుడు నా వయసు 12 ఏళ్లు మరి.

కానీ వాటిని ఎక్కడో పెట్టా. గుర్తురావడం లేదు.  మళ్లీ మా సార్ కు ఏం చెప్పాలి?  పోనీ అమ్మమ్మని అడగనా?  వద్దు అమ్మకు తెలుస్తుంది. ఇలా ఎన్నో విధాలు ఆలోచించా. చెమటలు పట్టేసాయి. వెంటనే తడుముకుంటూ చేయి నా స్కూలు డ్రస్ జేబు దగ్గరికి వెళ్లింది.  ఏదో తగిలింది.

తీసి చూస్తే ఇంకేముంది డబ్బులు...  భలే ఆనందంగా అనిపించింది.  ఒక్కసారిగా చెప్పలేనంత సంతోషం. ఏదో జయించినంత అనుభూతి.  పోయినవనుకున్న డబ్బులు దొరికాయని ...

నవనీత


No comments:

Post a Comment